Lent: A Time of Redemption - లెంట్: విమోచనా సమయము
యెషయా 58:1-14 | కీర్తన 6 | రోమా 2:1-13 | పరి. యోహాను 5:1-9 ప్రార్ధన : మా విమోచకుడవైన కృపగల దేవా! నీవు ఈ లోకమును ప్రేమించి, నీ జనితైక కుమారుని మరణ పునరుత్థానముల ద్వారా మమ్మును విమోచించినందులకు నీకు వందనములు చెల్లించుచున్నాము. క్రీస్తు రక్తము ద్వారా విమోచించబడిన మేము తగిన విధముగా జీవించడానికి, మరియు నీ ప్రేమ, దయ, విధేయత కలిగిన వారముగ ఉండుటకు నీ కృప అనుగ్రహించుమని నీతోను పరిశుద్ధాత్మతోను ఏక దేవుడుగా సదాకాలము జీవించుచు ఎలుచున్న మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వేడుకొనుచున్నాము. ఆమేన్. విమోచన: విమోచన అనే పదమునకు ఉన్న ప్రతిపదార్ధాలు విడుదల, రక్షణ. విమోచించబడడం అనగా కేవలం పాపముల నుండి విడుదల అని కాదు, మనకు ఉన్న సమస్యల నుండి విడుదల, కుటుంబ సమస్యల నుండి, ఆరోగ్య సమస్యల నుండి, ఆర్ధిక సమస్యల నుండి, సామజిక సమస్యల నుండి విడుదల. 1. విమోచన కొరకైనా ప్రార్ధన: కీర్తనకారుడు చేస్తూఉన్న హృదయవిదారక ప్రార్ధన, కీర్తన 6:3 - యెహోవా, నీవు ఎంతవరకు కరుణింపక యుందువు?