The Corruption of Creation - సృష్టి పతనము
యెషయా 5:1-13 | కీర్తన 8 | గలతి 1:5-10 | పరి. లూకా 13:13-16
ప్రార్ధన: సృష్టికర్తవైన సర్వశక్తి గల దేవా! నీ మహిమను ప్రచురపరచుచున్న నీ అద్భుత సృష్టిని బట్టి నీకు స్తుతులు చెల్లించుచున్నాము. స్వార్ధపూరితమైన మా తప్పిదమునుబట్టి నీ సృష్టి తన రూపమును, సంపూర్ణత్వమును కోల్పోయినందున మాకు పశ్చాత్తాపపడగల దీన మనస్సును అనుగ్రహించమని నిన్ను వేడుకొనుచున్నాము. సృష్టి పట్ల మీ ఉద్దేశ్యమును గుర్తించుటకు, పర్యావరణ సమతుల్యత సాధించుట కోసరము శ్రమించుటకు మరియు ఈ లోకమును సకల జీవరాశులకు సుందరమైన ఆవాసముగా చేయుటకు నీ జ్ఞానమును అనుగ్రహించుమని నీతోను పరిశుద్ధాత్మతోను ఏకదేవుడుగా సదాకాలము జీవించుచు ఏలుచుండు మా ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమెన్.
1. దేవుని ఉద్దేశ్యాన్ని తెలుసుకొనుట (కీర్తన 8): కీర్తన 8:6 - దేవుడు మనిషిని తాయారు చేసి, మనిషి కంటే ముందే సృష్టించబడిన ఈ సృష్టిని సంరక్షించడానికి, దానిని సరిచేయడానికి, సమతుల్యంగా ఉంచడానికి అధికారం ఇచ్చాడు (ఆది 2:15). కానీ మానవుడు అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ, తనకి నచ్చినట్టుగా ఈ సృష్టిని ఉపయోగించుకుంటూ, సృష్టి పతనానికి కాకుండా, తన స్వంత పతనానికి కూడా కారణం అవుతున్నాడు.
2. మన స్థితిని గుర్తెరుగుట (యెషయా 5:1-13): దేవుడు తన ఉద్దేశ్యాన్ని మనుషులకి అర్ధం అయ్యేలాగా చెప్పి, తనను పోలి ఉండాలి అని మార్గాన్ని నిర్దేశించాడు కానీ మానవుడు, అందరు మానవులు అంతే, అందులో నువ్వు నేను కూడా ఉన్నాము అనేది గ్రహించుకొని, జరుగుతున్న అనర్ధాలకు కారణం మనమే అనేది జ్ఞాపకం ఉంచుకోవాలి. దేవుడు వేసిన ద్రాక్ష తోటలో మంచి మొక్కలు నాటినా కూడా కారు ద్రాక్షలు కాయడానికి కారణం ఏమిటో మీరే చెప్పాలి (యెషయా 5:3) అని అయన మనలని ప్రశ్నిస్తూ ఉన్నాడు. సమాధానం చెప్పి, సరైన విధంగా జీవించకపోతే జరగబోయే పరిణామాలను కూడా తెలియచేస్తున్నాడు.
3. పశ్చత్తాపపడుట (లూకా 10:13-16): యేసు క్రీస్తు తన అనుచరులను 70 మందిని లోకం లోకి పంపిస్తూ కొరాజినా, బేత్సయిదా పట్టణాలను గురించి విచారిస్తున్న సందర్భం చూస్తున్నాము, ఇక్కడ పట్టణాలు అంటే మన అందరికి తెలిసిన గురజాడ అప్పారావు గారి మాట, దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్, పట్టణాలు అంటే పట్టాన ప్రజానీకం, దేవుని మాటకి, దేవుని ఆలోచనకి విలువ ఇవ్వకుండా తన ఉద్దేశ్యాలను తెలియచేసిన, అనేక సూచక క్రియలు చేసిన అర్ధం చేసుకోలేని స్థితిలో ఉండి వారికీ నచ్చినట్టుగా ప్రవర్తించి ఇప్పుడు సమస్యలు ఎదుర్కొనబోయే ప్రజానీకం గురించి మాట్లాడుతున్నాడు, అందులో నువ్వు నేను కూడా ఉన్నామేమో.
4. దేవుని ఉద్దేశ్యాన్ని జరిగించుట (గలతి 1:5-10): గలతి పత్రికలో పౌలు అంటున్న విషయం కూడా అదే, దేవుడి నుండి వచ్చిన సువార్త తప్ప మారె సువార్తకు నేను దాసుడను, అనుచరుడను అయినా కూడా, నేను దేవునికి దాసుడను కాదు అని. దేవుడి సువార్త మనుషులు మాత్రమే కాదు, సృష్టి అంత కూడా సంతోషంగా సామరస్యంగా, సమతుల్యంగా ఉండాలి అనేదే కానీ మన ప్రవర్తన ఆలా ఉందొ లేదో మనమే చూసుకోవాల్సిన వారమై ఉన్నాము.
దేవుని సువార్తను అర్ధం చేసుకొని, మన స్థితిని గమనించుకొని, చేస్తున్న తప్పులకి పాశ్చత్తాప పది, దేవుని ఉద్దేశ్యాన్ని ఈ లోకంలో జరిగించి అనేకులకు మాదిరికరంగా ఉండి, దేవుని దీవెనలు పొందుకునే లాగా మనలని మనం తీర్చిదిద్దుకుందాం.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి